విడుదలకు ముందే బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్న 'గేమ్ చేంజర్'

  • రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
  • శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ మూవీ
  • రేపు జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
  • నెల్లూరులో తొలి రోజున 103 షోస్
  • నెల్లూరులో మొదటి రోజు గ్రాస్ రూ.1.15 కోట్లు
  • సిటీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం రేపు (జనవరి 10) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. నెల్లూరులో తొలి రోజున ఏకంగా 103 షోస్ ప్రదర్శితం కానుంది. తద్వారా మొదటి రోజున ఏకంగా నెల్లూరులో రూ.1.15 కోట్ల గ్రాస్ వసూలు చేస్తోంది. 

నెల్లూరు సిటీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డు. ఇప్పటిదాకా సింహపురి నగరంలో మొదటి రోజున ఇన్ని షోస్, ఇంత కలెక్షన్ కొల్లగొట్టిన సినిమా మరొకటి లేదు. ఇప్పుడా రికార్డును గేమ్ చేంజర్ సొంతం చేసుకుంది.


More Telugu News