తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు

  • తిరుపతిలో గత రాత్రి తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి
  • పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు
  • నేడు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన సీఎం చంద్రబాబు
  • ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
  • అనంతరం మీడియా సమావేశం 
  • డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఆసుపత్రిలో క్షతగాత్రులతో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. 

తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ, టీటీడీ సీఎస్ఓ శ్రీధర్ గౌతమిలను బదిలీ చేశారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు తమ నిర్ణయాలు వెల్లడించారు.


More Telugu News