కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
- విచారణ కోసం నోటీసులు ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో పేర్కొంటారని వ్యాఖ్య
- కేటీఆర్కు ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదన్న జేడీ లక్ష్మీనారాయణ
- నోటీసుల్లా కాకుండా లేఖల్లా ఉన్నాయన్న జేడీ లక్ష్మీనారాయణ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు ఏసీబీ జారీ చేసిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదన్నారు. విచారణ కోసం నోటీసులు ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో పేర్కొంటారని, కానీ కేటీఆర్కు ఇచ్చిన నోటీసుల్లో అవి లేవన్నారు. కేటీఆర్కు ఇచ్చినవి నోటీసుల్లా కాకుండా లేఖల్లా ఉన్నాయన్నారు.
కేటీఆర్కు ఏసీబీ 160 సీఆర్పీసీ (ప్రస్తుతం 179 బీఎన్ఎస్) కింద నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో కేటీఆర్ నిందితుడు మాత్రమేనని... కాబట్టి నిందితుడికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వరాదన్నారు. ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలంటే బీఎన్ఎస్ 94 (గతంలో 91 సీఆర్పీసీ) కింద నోటీసు ఇవ్వాలని కానీ అలా ఇవ్వలేదన్నారు.
నిధుల గోల్మాల్ విచారణలో వెల్లడవుతుంది: ఏసీబీ మాజీ చీఫ్
ఫార్ములా ఈ-రేసింగ్ కేసుపై విచారణ జరుగుతోందని, నిధుల గోల్మాల్ విచారణలో వెల్లడవుతుందని ఏసీబీ మాజీ చీఫ్ పూర్ణచందర్ రావు అన్నారు. డబ్బులు ఇచ్చినట్లు కేటీఆరే చెబుతున్నారని, అదే విషయాన్ని విచారణలో ఏసీబీ అధికారులకు చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. విచారణ సమయంలో కేటీఆర్ వెంట న్యాయవాది అవసరం లేదన్నారు. డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినా అది నేరమే అవుతుందన్నారు.
ప్రభుత్వానికి నష్టం కలిగిస్తే క్రిమినల్ చర్య అవుతుందని తెలిపారు. ఈ కేసులో కేటీఆరే క్రియాశీలకమని ఏసీబీ అంటోందని గుర్తు చేశారు. అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే ఏసీబీ కేసు నమోదు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడానికి ఉండదన్నారు. విచారణలో పొంతన లేని సమాధానాలు చెబితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్నారు.