స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 50 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.89 శాతం నష్టపోయిన అదానీ పోర్ట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు కోలుకున్నప్పటికీ చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 78,148కి పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 23,688 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.97%), రిలయన్స్ (1.92%), ఐటీసీ (1.90%), ఏషియన్ పెయింట్ (1.80%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.83%).

టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (-1.89%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.75%), ఎల్ అండ్ టీ (-1.26%), సన్ ఫార్మా (-1.19%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.16%). 


More Telugu News