ఆ బీజేపీ ఎంపీ కాంగ్రెస్‌కు బాండ్లు ఇవ్వడం వెనుక క్విడ్ ప్రో కో: బాల్క సుమన్
- కాంగ్రెస్‌కు సీఎం రమేశ్ రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారన్న బీఆర్ఎస్ నేత
- కాంగ్రెస్‌కు బీజేపీ ఎంపీ బాండ్లు ఇవ్వడం కూడా క్విడ్ ప్రో కోనే అవుతుందని వ్యాఖ్య
- మోదీ, రేవంత్ రెడ్డి మధ్య బంధం ఉందంటూ విమర్శ
ఫార్ములా ఈ-రేస్ కేసులో క్విడ్ ప్రో కో ఉందంటే... కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని, అప్పుడు అదీ క్విడ్ ప్రో కోనే అవుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఫార్ములా ఈ-రేస్ సంస్థ గ్రీన్‌కో... బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇందులో క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లు క్విడ్ ప్రో కోనే అవుతుందని... అయినా లోగుట్టు పేరుమాళ్లకు ఎరుక అని పేర్కొన్నారు. సీఎం రమేశ్ బాండ్ల విరాళంలో తప్పేముందని అంటారా? తప్పేమీ లేదు... కానీ ఓ లాజిక్ ఉంది... రేవంత్ సీఎం అయ్యేందుకు ఎంపీ రమేశ్ ద్వారా బడే భాయ్ నరేంద్ర మోదీ చేసిన సాయం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డికి సాయం చేస్తే మోదీకి ఏమొస్తుందంటే... అదే లోగుట్టు... రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రధాని మోదీకి కొమ్ముకాయడం వెనుక అసలు గుట్టు! అని వ్యాఖ్యానించారు. వీరి మధ్య బంధం అప్పుడే పూర్తి కాలేదని, ఈ బంధం వెనుక మరో భరోసా ఉందని పేర్కొన్నారు. మోదీ ఆత్మీయ మిత్రుడు అదానీకి రేవంత్ రెడ్డి దోచి పెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తూ బడే భాయ్‌కి భజన చేస్తున్నాడన్నారు.