విచారణ గదిలో కేటీఆర్ తో పాటు లాయర్ కూర్చోవడానికి వీల్లేదు: తెలంగాణ హైకోర్ట్

  • విచారణకు లాయర్ ను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్
  • విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమన్న హైకోర్టు
  • కేటీఆర్ కు దూరంగా లాయర్ ఉండేందుకు అనుమతిస్తామని వెల్లడి
ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరాశ తప్పలేదు. కేసు విచారణకు తనతో పాటు తన లాయర్ ను కూడా అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేటీఆర్ విన్నపాన్ని తిరస్కరించింది. 

విచారణ గదిలో కేటీఆర్ తో కలిసి ఆయన లాయర్ కూర్చోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమని తెలిపింది. కేటీఆర్ కనిపించే విధంగా కాస్త దూరంలో లాయర్ ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. ముగ్గురు లాయర్ల  పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని అడిగింది. 

విచారణను లాయర్ చూసే నిబంధన ఏసీబీలో ఉందా? అని ప్రశ్నించింది. సాయంత్రం 4 గంటల్లోగా దీనికి సమాధానం చెపుతామని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.


More Telugu News