విశాఖ చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • నేడు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని
  • మోదీకి విశాఖలో స్వాగతం పలకనున్న చంద్రబాబు, పవన్
  • మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీ పర్యటనకు వస్తున్నారు. విశాఖలో ఈ సాయంత్రం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో స్వాగతం పలకనున్నారు. 

ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ కు జనసేన పార్టీ నేతలు కోన తాతారావు, పీవీఎస్ఎన్ రాజు, అంగ దుర్గా ప్రశాంతి,  పి.ఉషా కిరణ్, పేడాడ రామ్మోహన్, బోడపాటి శివదత్, బి.శ్రీనివాస్ పట్నాయక్ తదితరులు స్వాగతం పలికారు. 

ఎయిర్ పోర్టు నుంచి పవన్ నోవాటెల్ హోటల్ కు బయల్దేరారు. నోవాటెల్ దగ్గర పార్టీ నేతలు డా.పంచకర్ల సందీప్, కళ్యాణం శివ శ్రీనివాస్, తోట సత్యనారాయణలతోపాటు బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు.

పవన్ ఈ సాయంత్రం 4.15 గంటలకు ఎయిర్ పోర్టులో మోదీకి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4.45 గంటల నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్ షోలో పాల్గొంటారు. ప్రధాని కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి 7.25 గంటలకు పవన్ గన్నవరం బయల్దేరతారు.


More Telugu News