మీరేమైనా అనుకోండి .. 'డాకు మహారాజ్' గురించి తేల్చి చెప్పిన నాగవంశీ!
- 'డాకు మహారాజ్'గా వస్తున్న బాలకృష్ణ
- ఈ నెల 12న రిలీజ్ అవుతున్న సినిమా
- ఐటమ్ సాంగ్ పై స్పందించిన నాగవంశీ
- ఊర్వశి రౌతేలకి తెలుగు సరిగ్గా అర్థం కాలేదని వెల్లడి
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' సినిమా రూపొందింది. సితార నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు బాబీ .. నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు.
"ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ను బట్టి చూస్తే, 'కొండవీటి దొంగ' సినిమా పోలికలు కనిపిస్తున్నాయి .. దీనిపై మీరేమంటారు?" అంటూ విలేకరులు ప్రశ్నించారు. అందుకు నాగవంశీ స్పందిస్తూ .. "గుర్రం చూసి రిఫరెన్స్ అనుకుంటున్నారా? 'మంచివాళ్లకు మహారాజు .. చెడ్డ వాళ్లకు డాకు' అనే మేము చెప్పాలనుకున్నాం. మీరు 'కొండవీటి దొంగ' అనుకోండి .. రాబిన్ హుడ్ అనుకోండి .. ఇంకా ఏదైనా అనుకోండి .." అని అన్నారు.
ఈ సినిమాలో 'దబిడి దిబిడి' అనే స్పెషల్ సాంగ్ ను బాలయ్య - ఊర్వశి రౌతేలా పై చిత్రీకరించారు. ఇది పక్కా మాస్ ఆడియన్స్ కోసం చిత్రీకరించిన పాట. ఈ సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ పై ఊర్వశి రౌతేలా స్పందించిన తీరును గురించి విలేకరులు ప్రశ్నించారు. అందుకు నాగవంశీ స్పందిస్తూ .. "ఊర్వశి గారికి తెలుగు సరిగ్గా అర్థంకాక మీరంతా పొగిడారని అనుకుని పొరపాటున అలా స్పందించారు. ఆ తరువాత నేను .. బాబీ కలిసి ఆ పోస్టులను తీసేయించాము" అని చెప్పారు.