ఢిల్లీ రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా మెరిపిస్తా: బీజేపీ నేత రమేశ్ బిధూరి

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిశీపై పోటీ చేస్తున్న రమేశ్ బిదూరీ
  • బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తానని లాలు ప్రసాద్ గతంలో అబద్ధం చెప్పారన్న బీజేపీ నేత
  • తాను మాత్రం కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మెరిపిస్తానని వ్యాఖ్య
  • విమర్శలు రావడంతో వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన
ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే తన నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ బుగ్గల్లా మెరిపిస్తానని బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యానించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అతిశీపై పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా చేస్తానని గతంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ అబద్ధం చెప్పారని కానీ, తాను మాత్రం ఓక్లా, సంగం విహార్‌లోని రోడ్లను అభివృద్ధి చేసినట్టే కల్కాజీ రోడ్లను కూడా ప్రియాంకగాంధీ బుగ్గల్లా నిర్మిస్తానని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఆప్ నాయకుల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో బిధూరి వెనక్కి తగ్గారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాగా, అతిశీ తన తండ్రినే మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తన ఇంటి పేరును మర్లేనా నుంచి సింగ్‌గా మార్చుకున్నారని, వారి చరిత్ర ఇదేనని విమర్శించారు.


More Telugu News