డియర్ పవన్ కల్యాణ్ గారూ.. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థాంక్యూ: రామ్‌చరణ్
- నిన్న రాజమండ్రిలో గ్రాండ్‌గా 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- చీఫ్ గెస్ట్‌గా వచ్చిన తన బాబాయి పవన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చెర్రీ
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా శనివారం నాడు రాజమండ్రిలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేలాది మంది మెగా అభిమానులు, అతిరథమహారథుల మధ్య ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన తన బాబాయి పవన్ కల్యాణ్‌కు రామ్‌చరణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "డియర్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు... మీ అబ్బాయిగా, నటుడిగా, గర్వించదగ్గ భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థాంక్యూ" అని చెర్రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా జోడించారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.