ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న నారా లోకేశ్... గంటల వ్యవధిలోనే అక్కడ సీసీ కెమెరాలు

  • పాయకాపురం ప్రభుత్వ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
  • తమ భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న రమ్య అనే విద్యార్థిని
  • వెంటనే స్పందించిన లోకేశ్
  • కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు అమర్చిన వైనం
  • నిరంతరం పర్యవేక్షిస్తుండాలని బెజవాడ సీపీకి లోకేశ్ ఆదేశాలు
విజయవాడ పాయికాపురంలో ఈరోజు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని చెప్పిన సమస్యపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన స్పందన గంటల వ్యవధిలోనే కార్యరూపం దాల్చింది. 

కళాశాల వెలుపల రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రమ్య మంత్రి లోకేశ్ ను కోరింది. విద్యార్థినుల భద్రత అంశాన్ని సీరియస్ గా తీసుకున్న లోకేశ్... పాయకాపురం జూనియర్ కళాశాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా లోకేశ్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును ఆదేశించారు.  

చెప్పిన గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం కావడంపై పాయకాపురం జూనియర్ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైనమిక్ మినిస్టర్ పనితీరు ఎలా ఉంటుందో చేతల్లో చూపించారని వారు కొనియాడారు.
Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.


More Telugu News