విశాఖకు త్వరలోనే మెట్రో రైలు రాబోతోంది: సీఎం చంద్రబాబు
- విశాఖలో నేవీ డే వేడుకలు
- చీఫ్ గెస్టుగా హాజరైన సీఎం చంద్రబాబు
- విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని అని వ్యాఖ్యలు
- నేవీ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని కితాబు
విశాఖపట్నంలో నేడు నిర్వహించిన నేవీ డే వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, విశాఖ నగరం ఏపీకి ఆర్థిక రాజధాని అని పేర్కొన్నారు. విశాఖకు త్వరలోనే మెట్రో రైలు రాబోతోందని వెల్లడించారు. విశాఖపట్నం నగరం ప్రశాంతతకు మరోపేరు అని అభివర్ణించారు. విశాఖ నగరాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
ఇక, విశాఖ సాగరతీరంలో భారత నావికాదళం నిర్వహించిన విన్యాసాలు కళ్లు చెదిరేలా ఉన్నాయని పేర్కొన్నారు. నేవీ సిబ్బంది క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తోందని, గతంలో అనేక పర్యాయాలు తాను విశాఖ వచ్చానని, కానీ ఈసారి చాలా సంతోషంగా అనిపిస్తోందని తెలిపారు. గతంలో హుద్ హుద్ తుపాను విలయం సృష్టించిన సమయంలో, ఆపన్నులను ఆదుకునేందుకు నేవీ సహకారం మరువలేనిదన్నారు.