గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
- రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
- శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
- జనవరి 10న గ్రాండ్ రిలీజ్
- విడుదల రోజున ఆరు షోలు
- బెనిఫిట్ షో టికెట్ రూ.600... అనుమతిచ్చిన ఏపీ సర్కారు
- మల్టీప్లెక్స్ లో రూ.175, సింగిల్ స్క్రీన్ పై రూ.135 వరకు పెంపు
- ఇవే ధరలతో జనవరి 11 నుంచి 23 వరకు రోజుకు ఐదు షోలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
బెనిఫిట్ షో టికెట్ రూ.600 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు వేయనున్నారు. ఈ నెల 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ పై అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై అదనంగా రూ.135 వరకు పెంచుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవే ధరలతో జనవరి 11 నుంచి 23 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది