నాలుకతో ఒక్క నిమిషంలో 57 ఫ్యాన్ బ్లేడ్లను ఆపి... గిన్నిస్ బుక్ లో ఎక్కిన తెలంగాణ వ్యక్తి!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కిన సూర్యాపేట వాసి క్రాంతి కుమార్
- మనోడి సాహసోపేత ప్రదర్శన తాలూకు వీడియోను షేర్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ
- వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
అసాధ్యం అనుకునే పనిని సుసాధ్యం చేస్తూ, అందులోనూ తక్కువ సమయంలో అలాంటి పనులు చేసే వారికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కుతుంది. తాజాగా తెలంగాణకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అనే వ్యక్తి కూడా ఒక సాహసోపేత పనితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాడు. సూర్యాపేట వాసి క్రాంతి కుమార్ ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్‌లను నాలుకతో ఆపేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.
మనోడి ఈ సాహసోపేత ప్రదర్శన తాలూకు వీడియోను గిన్నిస్ బుక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. వీడియోలో వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడ్లను క్రాంతి కుమార్ తన నాలుకతో ఆపడం కనిపించింది. కొన్ని ఫ్యాన్లను ఆపిన తర్వాత అతని నాలుకకు గాయమై రక్తం కారడం కూడా వీడియోలో ఉంది.
అయినా అతడు వెనుకడుగు వేయకుండా అలాగే ముందుకు సాగాడు. చివరికి ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్‌లను నాలుకతో ఆపి వరల్డ్ రికార్డు సృష్టించాడు. దీంతో క్రాంతి కుమార్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్ అందజేసింది.
"57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్‌లు క్రాంతి కుమార్ ఒక్క నిమిషంలో నాలుకను ఉపయోగించి ఆపేశారు" అని గిన్నిస్ బుక్ రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.