కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త: వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్

  • ఓ వ్యక్తి కారు డోర్ తీయడంతో ప్రమాదానికి గురైన బైక్
  • తన కారణంగా ప్రమాదం జరిగినప్పటికీ కారును ముందుకు పోనిచ్చిన వైనం
  • దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 అర్ధరాత్రి జరిగిన ఘటన
కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రమాదాలు జరుగుతాయంటూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ... సూచన చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు డోర్ తీయడంతో ఓ బైక్ ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత పట్టించుకోకుండానే ఆ కారును ముందుకు పోనిస్తారు. ఈ ఘటనపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఏమిటీ నిర్లక్యం... కనీస మానవత్వం కూడా లేదా!? నడిరోడ్డుపై వాహనాన్ని ఆపి... కారు డోర్ తెరవడమే తప్పు!! తమ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందనే సోయి లేకుండా... తమకేం పట్టనట్టు ఎలా ప్రవర్తించారో చూడండి. న్యూ ఇయర్ నాడు దేశ రాజదాని న్యూఢిల్లీలో జరిగిందీ ప్రమాదం" అంటూ సజ్జనార్ రాసుకొచ్చారు.

కారు డోర్‌ తీసేటప్పుడు జాగ్రత్త! వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గుర్తించి కారు డోర్‌ తీయండని సూచించారు. తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణం కావొద్దని సూచించారు.


More Telugu News