శ్రీకాంత్ ఓదెలతో సినిమా... చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
- ఇటీవలే శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన
- ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం
- ఈ సినిమాకు రూ.75 కోట్లు తీసుకోనున్న చిరంజీవి
- ఈ మేరకు 'సియాసత్' కథనం
- ఈ కథనం నిజమైతే చిరు కెరీర్‌లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అయ్యే అవకాశం
మెగాస్టార్ చిరంజీవితో దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా, సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ మూవీలో చిరును పూర్తిగా కొత్త అవతార్‌లో చూస్తారని, స్క్రీన్‌ప్లే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు శ్రీకాంత్ పేర్కొన్నారు.
అయితే, తాజా నివేదిక ప్రకారం ఈ చిత్రం కోసం చిరు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆయన కెరీర్‌లోనే ఇప్పటివరకూ తీసుకోని విధంగా రూ. 75 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు 'సియాసత్' మీడియా సంస్థ పేర్కొంది. ఈ కథనం నిజమైతే చిరు కెరీర్‌లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అయ్యే అవకాశం ఉంది.
ఇక చిరు చిత్రానికి తొలిసారి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల హైదరాబాద్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం విశేషాలను పంచుకున్నారు. కేవలం 48 గంటల్లోనే స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసినట్లు చెప్పుకొచ్చారాయన.
"చిరంజీవి తన కారవాన్ నుంచి బయటకు వచ్చే వరకు మాత్రమే నేను ఆయన అభిమానిని. ఒక్కసారి ఆయన సెట్‌లోకి అడుగు పెడితే నా సినిమాలో క్యారెక్టర్ మాత్రమే. నేను చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో పని చేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. 48 గంటల్లో స్క్రిప్ట్‌ని ఫైనల్ చేశాం" అని అన్నారు.
ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల నానితో రెండో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. 'ది ప్యారడైజ్' పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. అటు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత చిరు, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు పట్టాలెక్కె అవకాశం.