సీఎం రేసులో నేను, కవిత ఉన్నామని ప్రచారం చేస్తున్నారు: కేటీఆర్

  • తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరేనన్న కేటీఆర్
  • రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి గుణపాఠం చెబుతామని హెచ్చరిక
  • ఈ-కార్ రేసింగ్ కేసుపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు వెల్లడి
ముఖ్యమంత్రి రేసులో కేటీఆర్, కవిత ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తమ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరేనని స్పష్టం చేశారు. కానీ కేటీఆర్, కవిత అంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని పరిణామాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు.

ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ తన మీద నమోదు చేసిన కేసుపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నానని కేటీఆర్ అన్నారు. తనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.

న్యాయనిపుణుల సూచనల మేరకు ఈడీ ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులన్నీ తప్పుడు కేసులే అన్నారు. తనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్టులకు, కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు.


More Telugu News