తిరుమ‌ల స్వామివారి సేవ‌లో న‌టి జాన్వీ క‌పూర్‌

  • శుక్ర‌వారం నాడు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమ‌ల‌ చేరుకున్న జాన్వీ
  • ఇవాళ ఉద‌యం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న స‌మ‌యంలో స్వామివారి సేవ‌లో పాల్గొన్న న‌టి
  • ఆమెకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు. శుక్ర‌వారం నాడు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఇవాళ ఉద‌యం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న స‌మ‌యంలో ఆమె స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు. 

టీటీడీ అధికారులు ఆమెకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంత‌రం జాన్వీకి రంగ‌నాయ‌కుల మండ‌పంలో పండితులు వేదాశీర్వ‌చనం పలికి, స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. కాగా, ఆమె ఇంత‌కుముందు కూడా ప‌లుమార్లు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

ఇక జాన్వీ క‌పూర్ తెలుగులో 'దేవ‌ర' సినిమాతో అరంగేట్రం చేశారు. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలోనే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించే అకాశం ద‌క్కించుకున్నారు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌కు జోడిగా ఆమె న‌టించ‌నున్నారు.  




More Telugu News