మళ్లీ కోహ్లీ అదే పొరపాటు.. పెవిలియన్‌కి క్యూ కడుతున్న బ్యాటర్లు.. కష్టాల్లో భారత్
- మళ్లీ ఆఫ్‌సైడ్ వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించి ఔటైన కోహ్లీ
- 78 పరుగులకే కీలకమైన 4 వికెట్లు పారేసుకున్న టీమిండియా
- బ్యాట్ ఝుళిపిస్తున్న రిషభ్ పంత్
- 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బలహీనతకే ఔట్ అయ్యాడు. స్కాట్ బొలాండ్ లాండ్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించి స్లిప్‌లో ఉన్న స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. బీజీటీ సిరీస్‌లో కోహ్లీ ఇలా మళ్లీ మళ్లీ అదే పొరపాటు చేస్తూ పెవిలియన్ చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం.
ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా మరోసారి తడబడింది. 78 పరుగులకే కీలకమైన 4 వికెట్లు పారేసుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13) తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించిన.. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ అయ్యారు. శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లీ (06) మరోసారి నిరాశపరిచారు.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస బౌండరీలు బాదుతూ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజులో పంత్ (61), రవీంద్ర జడేజా (02) ఉండగా.. భారత్ స్కోరు 124/4 (22 ఓవర్లు). తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా 128 పరుగుల ముందంజలో ఉంది.