సౌరవ్ గంగూలీ కూతురు కారును ఢీ కొట్టిన బస్సు
- కోల్ కతాలో ప్రమాదం.. గంగూలీ కూతురు సనా క్షేమం
- కారును వెనక నుంచి ఢీ కొట్టిన బస్సు డ్రైవర్
- డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ కూతురు సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. సనా కారును ఓ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో సనా కారుకు డ్యామేజీ అయిందని, సనాకు మాత్రం గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుందని వివరించారు.
బెహలా చౌరస్తాలో సనా కారును ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడని చెప్పారు. డ్రైవర్ తో కలిసి సనా బస్సును వెంటాడి కొంతదూరం వెళ్లిన తర్వాత అడ్డగించిందన్నారు. తమకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు.