వొడాఫోన్ ఐడియా సరికొత్త రీచార్జ్ ప్లాన్... ఏడాది పొడవునా డేటా ఫ్రీ

  • వొడాఫోన్ ఇండియా (వీఐ) సరికొత్త ఆఫర్‌ సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌
  • ఏడాది పొడవునా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్‌‌లిమిటెడ్ డేటా
  • సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం 
ప్రైవేటు రంగ టెలికం కంపెనీలో నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్‌లను కాపాడుకునేందుకు, కొత్తగా వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు వివిధ రకాల ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. జియో, భారతి, ఎయిర్‌టెల్ టెలికం సంస్థలు తమ 4 జీ యూజర్లకు నిర్దేశిత ప్లాన్‌పై అన్‌‌లిమిటెడ్ 5 జీ డేటాను ఉచితంగా ఇస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ ఇండియా (వీఐ) సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. తమ వినియోగదారుల కోసం వోడాఫోన్ .. ఐడియా సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా తీసుకువచ్చింది.

రూ.3,599 లేదా 3,699 లేదా రూ.3,799తో రీచార్జి చేసిన వారికి ఏడాది పొడవునా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అపరిమిత డేటా అందిస్తోంది. మిగతా 12 గంటల పాటు ప్రతి రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఈ డేటాను వినియోగించుకోకపోతే .. వారాంతం వరకు ఇది రోల్ ఓవర్ అవుతుంది. అంటే వీకెండ్ ముగిసే లోగా ఆ మొత్తం డేటాను వాడుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

రూ.3,699తో రీఛార్జి చేస్తే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. రూ.3,799 తో రీఛార్జి చేస్తే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌లను త్వరలో ఇతర సర్కిళ్లకూ తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.


More Telugu News