చిరంజీవిగారు దీప్తి జీవాంజికి మూడు లక్షలు అందించటం ఎంతో సంతోషాన్నిచ్చింది: పుల్లెల గోపీచంద్
- పారిస్ పారా ఒలింపిక్స్ లో పతకం సాధించిన దీప్తి జీవాంజి
- దీప్తి వరంగల్ జిల్లా అథ్లెట్
- ఇటీవల రూ.3 లక్షల చెక్ అందించిన చిరంజీవి
- వీడియో రూపంలో తన స్పందన వెలువరించిన గోపీచంద్
ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన అథ్లెట్ దీప్తి జీవాంజి. వరంగల్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె భారత త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. ఇటీవల ఆమెకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించి, రూ.3 లక్షల చెక్ అందించారు. దీనిపై భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందించాడు.
"పారిస్ లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవిగారిని కలవాలనుందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జీవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు.
అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతీ ఒక్క ప్లేయర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా స్పోర్ట్స్ పర్సన్స్‌కి చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేషన్‌తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను" అంటూ పుల్లెల గోపీచంద్ వీడియో సందేశం వెలువరించారు.
Your browser does not support HTML5 video.