రెండు కొత్త డిపాజిట్ స్కీములు తీసుకువచ్చిన ఎస్ బీఐ

  • వివరాలు తెలిపిన ఎస్ బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి
  • హర్ ఘర్ లఖ్ పతి, ఎస్ బీఐ ప్యాట్రన్స్ పేరిట కొత్త డిపాజిట్ స్కీములు
  • వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త స్కీములు
వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త డిపాజిట్ స్కీములు తీసుకువచ్చినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. వీటి పేర్లు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్ బీఐ ప్యాట్రన్స్ అని వివరించారు. 

వీటిలో హర్ ఘర్ లఖ్ పతి అనేది రికరింగ్ డిపాజిట్ పథకం అని, రూ.1 లక్ష అంతకుమించి నిధులు సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. మైనర్లకు కూడా ఈ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

ఇక, రెండో పథకం ఎస్ బీఐ ప్యాట్రన్స్ అనేది వృద్ధులను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన పథకం అని ఎస్ బీఐ చైర్మన్ వెల్లడించారు. ఈ పథకంలో అధిక వడ్డీ చెల్లిస్తామని స్పష్టం చేశారు.


More Telugu News