నిరాహారదీక్షకు కూర్చున్న ప్రశాంత్ కిశోర్

  • బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు
  • మళ్లీ పరీక్షలు నిర్వహించాలంటూ అభ్యర్థుల డిమాండ్
  • అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిశోర్ నిరాహార దీక్ష
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆమరణ దీక్ష చేపట్టారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆయన దీక్ష చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను మళ్లీ నిర్వహించాలని పరీక్షలు రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. 

అయితే, పరీక్షలను మళ్లీ నిర్వహించే ప్రసక్తేలేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో, గత రెండు వారాలుగా పరీక్షలు రాసిన అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి మద్దతుగా ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News