విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు

  • సచ్చిదానంద స్వామిని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
  • ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించిన సచ్చిదానంద స్వామి
  • ముఖ్యమంత్రి వెంట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. గణపతి సచ్చిదానంద స్వామికి, ఇతర పీఠాధిపతులకు పూలమాలలు వేసి గౌరవించారు. వారికి పుష్ప గుచ్ఛాలు, పండ్లు అందించారు. గణపతి సచ్చిదానందకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను, పవిత్ర గ్రంథాలను బహూకరించారు. 

అనంతరం, గణపతి సచ్చిదానంద స్వామి... సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. కాగా, చంద్రబాబుకు సచ్చిదానంద ఆశ్రమ వర్గాలు ఘనస్వాగతం పలికాయి.


More Telugu News