ఇండియన్ ఫుడ్ పై... ఈ దేశాల్లో నిషేధం ఎందుకు?
- మన దేశంలో ఇష్టంగా తినే వంటకాలపై కొన్ని దేశాల్లో నిషేధం
- ఆయా దేశాల సాంస్కృతిక అంశాలు, నమ్మకాలతో చర్యలు
- అమెరికాలోనూ ఒక ఆహార పదార్థంపై నియంత్రణలు
మన భారతీయ వంటకాల తీరే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరొందుతున్నాయి. అద్భుతమైన రుచిని కోట్లాది మంది ఆస్వాదిస్తున్నారు. కానీ కొన్ని రకాల భారతీయ వంటకాలు, పదార్థాలపై కొన్ని దేశాల్లో నిషేధాలు, నియంత్రణలు ఉన్నాయని మీకు తెలుసా? అవేమిటో తెలుసుకుందామా...
సమోసా – సోమాలియా
ముక్కోణపు ఆకారంలో ఉండే సమోసాను సోమాలియా దేశంలో నిషేధించారు. దీనికి కారణం కూడా చిత్రమే. ఆ దేశంలో క్రైస్తవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. అందులో అల్ షబాబ్ క్రిస్టియానిటీ గ్రూపునకు చెందిన చిహ్నాన్ని కించపర్చేలా సమోసా ఆకృతి ఉందంటూ ఆ దేశంలో ముక్కోణపు ఆకారపు సమోసాలపై నిషేధం అమల్లోకి తెచ్చారు.
కబాబ్ – వెనీస్
ఇటలీలోని వెనీస్ నగరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం. కానీ మన దేశంలో ఫేమస్ అయిన కబాబ్ లను 2017 నుంచి వెనీస్ లో నిషేధించారు. ఆ నగర సంప్రదాయాలకు, అభిరుచులకు కబాబ్ విరుద్ధమంటూ ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
మసాలా పొడులు – సింగపూర్, హాంకాంగ్
సింగపూర్, హాంకాంగ్ లలో భారతీయ కంపెనీల నుంచి వచ్చే మసాలాలను నిషేధించారు. ఎవరెస్ట్, ఎండీహెచ్ వంటి పెద్ద భారతీయ కంపెనీల మసాలాల్లో ఇథైలీన్ ఆక్సైడ్ గా పిలిచే కేన్సర్ కారక పురుగు మందు అవశేషాలు ఉంటున్నాయంటూ ఈ చర్య తీసుకున్నారు.
నెయ్యి – అమెరికా
భారతదేశంలో నెయ్యికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కానీ అమెరికాకు చెందిన ఆహార నాణ్యత ప్రాధికార సంస్థ ‘ఎఫ్ డీఏ’... మన దేశ నెయ్యిపై నియంత్రణలు విధించింది. నెయ్యి వాడకం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, హైబీపీ వస్తున్నాయంటూ ఈ చర్య తీసుకుంది.
చ్యవన్ ప్రాశ్ – కెనడా
వివిధ రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు కలిపి తయారు చేసే చ్యవన్ ప్రాశ్ కు మన దేశంలో ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే ఆయుర్వేద ఔషధంగా దీనికి గుర్తింపు ఉంది. కానీ చ్యవన్ ప్రాశ్ లో అధిక స్థాయిలో ప్రమాదకర మెర్క్యురీ, లెడ్ ఖనిజాల అవశేషాలు ఉన్నాయంటూ... 2005లో కెనడా దీనిపై నిషేధం విధించింది.
గసగసాలు – తైవాన్, సింగపూర్, యూఏఈ, సౌదీ
మన దేశంలోని కొన్ని రకాల వంటల్లో గసగసాలను వినియోగిస్తుంటాం. అవి లేనిదే కొన్ని రకాల వంటలను ఊహించుకోలేం కూడా. అలాంటి గసగసాలపై తైవాన్, సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు నిషేధం అమలు చేస్తున్నాయి. గసగసాల్లో ‘మార్ఫిన్’ మాదకద్రవ్యం అవశేషాలు ఉన్నాయన్నదే దీనికి కారణం.