సిడ్నీ టెస్టు.. సేమ్ సీన్ రిపీట్‌.. టీమిండియా 185 ర‌న్స్‌కే ఆలౌట్‌

  • సిడ్నీ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ ఐదో టెస్టు
  • మ‌రోసారి త‌డ‌ప‌డ్డ భార‌త బ్యాట‌ర్లు
  • 40 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన పంత్ 
  • 4 వికెట్లు ప‌డ‌గొట్టిన స్కాట్ బొలాండ్
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో భార‌త జ‌ట్టు బ్యాట‌ర్లు మ‌రోసారి త‌డ‌ప‌డ్డారు. దాంతో టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా 72.2 ఓవ‌ర్ల‌లో 185 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భార‌త ఇన్నింగ్స్ లో 40 ప‌రుగుల‌తో రిష‌భ్ పంత్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. గిల్ (20), ర‌వీంద్ర జ‌డేజా (26), కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా (22) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. 

కేఎల్ రాహుల్ (04), య‌శ‌స్వి జైస్వాల్ (10) త‌క్కువ స్కోర్లకే పెవిలియ‌న్ చేరారు. విరాట్ కోహ్లీ (17), నితీశ్ కుమార్ రెడ్డి (0) మ‌రోసారి నిరాశ ప‌రిచారు. ఆసీస్ బౌల‌ర్లలో స్కాట్ బొలాండ్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... మిచెల్ స్టార్క్ 3, పాట్ క‌మిన్స్ 2, నాథ‌న్ లైయ‌న్ ఒక వికెట్ తీశారు. 


More Telugu News