విలనిజం చూపించేందుకు సిద్ధమైన ఉదయభాను

  • తొలి నుంచీ టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న ఉదయభాను
  • సరైన పాత్రలు రాక వెనుకబడ్డ వైనం
  • 'బార్బరిక్' సినిమాలో నెగెటివ్ పాత్రను పోషిస్తున్న భాను
బుల్లితెర యాంకర్లు ఎంతో మంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ జాబితాలో సుమ, ఝాన్సీ, రష్మీ, శిల్పా చక్రవర్తి, అనసూయ ఇలా ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఉదయభాను కూడా ఒకరు. తొలి నుంచీ కూడా ఉదయభాను టాలీవుడ్ పై ఫోకస్ చేస్తూనే ఉంది. సరైన పాత్రలు మాత్రం ఆమెకు రాలేదు. దీంతో, ఆమె ఐటెం సాంగ్స్ కూడా చేసింది. 

తాజాగా మరో యాంగిల్ ను చూపించేందుకు ఉదయభాను రెడీ అవుతోంది. విలన్ గా సత్తా చాటేందుకు భాను సిద్ధమయింది. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'బార్బరిక్' సినిమాలో ఉదయభాను విలనిజం చూపించబోతోందట. ఈ చిత్రానికి శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుందట.


More Telugu News