అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు

  • రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో బన్నీ పిటిషన్
  • ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు
  • బన్నీ రెగ్యులర్ బెయిల్ పై సర్వత్ర ఉత్కంఠ
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి కోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు... కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. 

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బన్నీపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా, నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. తెలంగాణ హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. 

మరోవైపు, రిమాండ్ గడువు ముగియడంతో కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యాడు. అదేరోజున బన్నీ తరపు లాయర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, బన్నీకి రెగ్యులర్ బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది.


More Telugu News