సజ్జల కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు.. విచారణకు పవన్ ఆదేశం

  • కడప శివార్లలో 52 ఎకరాల భూములు కబ్జా చేశారంటూ ఆరోపణలు
  • పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశం
  • పేదల, ప్రభుత్వ భూముల జోలికి వస్తే సహించేది లేదన్న పవన్
వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు ఆక్రమించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ కబ్జా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. 

భూ కబ్జా వ్యవహారంపై విచారణ జరపాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. సజ్జల కుటుంబం కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. పేదల, ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మరోవైపు, ఈ భూముల్లోనే సజ్జల గెస్ట్ హౌస్ కట్టుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News