సిడ్నీ టెస్టు.. రోహిత్ బెంచ్‌కే.. బ్యాటింగ్ లో భార‌త్ త‌డ‌బాటు..!

  • సిడ్నీ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ ఐదో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • రోహిత్ బ‌దులు కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా
  • హిట్‌మ్యాన్‌ స్థానంలో తుది జ‌ట్టులోకి శుభ్‌మ‌న్ గిల్‌
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఆఖ‌రిదైన ఐదో టెస్టులో మొద‌ట టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్ర‌చారంలో ఉన్న‌ట్లుగా ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఫామ్‌లేక తంటాలు పడుతున్న హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో స్వ‌చ్ఛందంగా త‌ప్పుకున్నాడు. అత‌ని స్థానంలో యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ తిరిగి తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. 

అలాగే గాయం కార‌ణంగా త‌ప్పుకున్న పేస‌ర్ ఆకాశ్ దీప్ స్థానంలో మ‌రో పేస‌ర్ ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను తీసుకున్నారు. ఈ రెండు మార్పుల‌తో భార‌త్ ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగింది. అటు ఆతిథ్య ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ స్థానంలో కొత్త ప్లేయ‌ర్‌ వెబ్‌స్టెర్‌ను తీసుకుంది. ఈ మ్యాచ్‌ ద్వారా వెబ్‌స్టెర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. 17 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు ఇద్ద‌రూ పెవిలియ‌న్ చేరారు. మొద‌ట కేఎల్ రాహుల్ (04), ఆ త‌ర్వాత య‌శ‌స్వి జైస్వాల్ (10) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఔట్ అయ్యారు. ప్ర‌స్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (09), గిల్ (14) ఉండ‌గా.. భార‌త్ స్కోర్ 42/2 (17 ఓవ‌ర్లు).


More Telugu News