హైదరాబాద్ చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై హైకోర్టులో విచారణ

  • 3,532 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ అంశంపై విచారణ
  • 700కు పైగా చెరువులకు తుది నోటిఫికేషన్ ఇచ్చినట్లు న్యాయవాది వెల్లడి
  • మిగిలిన చెరువుల తుది నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్న ప్రభుత్వ న్యాయవాది
హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్ఎండీఏ పరిధిలోని 3,532 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ అంశంపై హైకోర్టు విచారించింది. హైడ్రా విడుదల చేసిన ఎఫ్‌టీఎల్ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 700కు పైగా చెరువులకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన చెరువులకు సంబంధించి కూడా తుది నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాగా, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.


More Telugu News