మ‌ను బాక‌ర్‌, గుకేశ్‌ల‌కు ఖేల్ ర‌త్న‌

  • 2024 ఏడాదికి గాను న‌లుగురు క్రీడాకారుల‌కు ఖేల్ ర‌త్న
  • మ‌ను బాక‌ర్‌, గుకేశ్‌తో పాటు ప్ర‌వీణ్ కుమార్, హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌కు అవార్డు
  • ఈ నెల 17న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్ర‌దానోత్స‌వం
కేంద్ర ప్ర‌భుత్వం భార‌త అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్ ర‌త్న పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. 2024 ఏడాదికి గాను గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచిన‌ న‌లుగురు క్రీడాకారుల‌ను ఖేల్ ర‌త్న కోసం ఎంపిక చేసింది. 

ఊహాగానాల‌కు తెర‌దించుతూ స్టార్ షూట‌ర్ మ‌ను బాక‌ర్‌కు కేంద్రం ఈ అవార్డును ప్ర‌క‌టించింది. అవార్డుకు ద‌ర‌ఖాస్తు విష‌య‌మై మ‌ను బాక‌ర్‌కు, అవార్డుల క‌మిటీకి మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. 

మ‌నుతో పాటు ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ విజేత గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్ర‌వీణ్ కుమార్, భార‌త హాకీ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌కు కేంద్రం ఈ అవార్డును ప్ర‌క‌టించింది. ఈ నెల 17న ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడా శాఖ ప్ర‌క‌టించింది. 


More Telugu News