ఎయిర్ ఇండియా ప్రయాణికులకు శుభవార్త.. విమానాల్లో ఇక వైఫై సేవలు

  • 10 వేల అడుగున ఎత్తున కూడా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే వీలు
  • ఈ సేవలు తీసుకొస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డు
  • తొలుత అంతర్జాతీయ రూట్లలో అందుబాటులోకి
  • ఆ తర్వాత దేశీయ విమానాల్లో సేవలు
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇకపై దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో వైఫై సేవలు ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఫలితంగా విమానాల్లో ఈ సేవలు అందిస్తున్న మొదటి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డులకు ఎక్కనుంది. వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఇక బడలిక లేకుండానే, సమయం తెలియకుండానే ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం దక్కుతుంది. అయితే, ఈ సర్వీసులు శాటిలైట్ కనెక్టివిటీ, బ్యాండ్‌విడ్త్, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా ఉంటాయని ఎయిర్ ఇండియా తెలిపింది.

విమానంలో అందుబాటులోకి వచ్చే వైఫై సేవలతో ల్యాప్‌టాప్స్, ట్యాబ్‌లెట్స్, స్మార్ట్‌ఫోన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 10 వేల అడుగుల ఎత్తున కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఎయిర్‌బస్ ఏ350, ఎయిర్‌బస్ ఏ321 నియో, బోయింగ్ 787-9 వంటి న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విమానాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత దశలవారీగా దేశీయ విమానాల్లో వైఫై సేవలు ప్రారంభిస్తారు. 


More Telugu News