రెండోసారి త‌ల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్‌.. స్పెష‌ల్ వీడియో ద్వారా వెల్ల‌డి!

      
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానా రెండోసారి త‌ల్లి కాబోతోంది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన‌ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా తెలియ‌జేసింది. ఆ వీడియోలో... 2024 ప్రేమ‌, శాంతితో గ‌డిచిపోయింద‌ని ఆమె వెల్ల‌డించింది. త‌న కుమారుడు కోవా ఫీనిక్స్ డోల‌న్‌, భ‌ర్త మైఖేల్‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను వీడియో ద్వారా ఇలియానా పంచుకున్నారు. 

ఇందులో భాగంగానే అక్టోబ‌ర్‌లో తాను గ‌ర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. కాగా, 2023 ఆగ‌స్టులో ఇలియానా కుమారుడికి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటూ... ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 


More Telugu News