పుట్టపర్తి సాయిబాబాను ద‌ర్శించుకున్న‌ న‌టి సాయిప‌ల్ల‌వి

  
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా న‌టి సాయిప‌ల్ల‌వి పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబాను ద‌ర్శించుకున్నారు. కుటుంబంతో క‌లిసి పుట్ట‌ప‌ర్తికి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టుచీరలో సంప్రదాయంగా క‌నిపించారామె. బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ హీరోగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన 'అమ‌ర‌న్' చిత్రం ఇటీవ‌ల బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అలాగే ప్ర‌స్తుతం ఆమె తెలుగులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న‌ 'తండేల్' సినిమాలో న‌టిస్తున్నారు. 


More Telugu News