ప్రధాని మోదీ ప్రకటనపై రామ్ చరణ్ స్పందన

ప్రధాని మోదీ ప్రకటనపై రామ్ చరణ్ స్పందన
  • వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ 2025 ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన రామ్ చరణ్ 
  • భారతదేశాన్ని ప్రపంచానికే ఓ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు కానున్న వేవ్స్
  • చిత్ర పరిశ్రమ సహకారానికి వేవ్స్ 2025 అసలైన గేమ్ ఛేంజర్ కానుందన్న రామ్ చరణ్  
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‍‌ను 2025 (వేవ్స్)లో నిర్వహించనున్నట్లు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రపంచ దేశాల మీడియా, వినోద రంగాల ప్రముఖులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమ వైపు ప్రపంచమంతా చూస్తోందన్నారు. 

భారతదేశాన్ని ప్రపంచానికే ఓ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు కానున్న వేవ్స్‌పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా రామ్ చరణ్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర పరిశ్రమ సహకారానికి వేవ్స్ 2025 అసలైన గేమ్ ఛేంజర్ కానుందని రామ్ చరణ్ పేర్కొన్నారు.  


More Telugu News