'అన్​స్టాపబుల్'​లో 'డాకు మహారాజ్' టీమ్ సందడి... ఆ హీరోయిన్ పేరుతో తమన్​ను ఆటపట్టించిన బాలయ్య!

  • జ‌న‌వ‌రి 3న 'డాకు మహారాజ్' టీమ్ తాలూకు ఎపిసోడ్ ప్ర‌సారం
  • తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేసిన 'ఆహా'
  • బాబీ కొల్లి, తమన్‌, సూర్యదేవర నాగవంశీతో క‌లిసి బాల‌య్య‌ సంద‌డి
  • అనుష్క శ‌ర్మ అంటే చాలా ఇష్టం కదా? అంటూ త‌మ‌న్‌తో ఆడుకున్న బాలకృష్ణ
నంద‌మూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న‌ టాక్ షో అన్ స్టాపబుల్. తాజాగా ఈ షోలో తన అప్‌క‌మింగ్ మూవీ 'డాకు మహారాజ్' టీమ్ తో క‌లిసి బాల‌య్య‌ సంద‌డి చేశారు. ఈ ఎపిసోడ్ తాలూకు స్పెషల్ ప్రోమోను తాజాగా ఆహా విడుద‌ల చేసింది. ఇందులో ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి, సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌, నిర్మాత‌ సూర్యదేవర నాగవంశీ తమదైన శైలిలో సందడి చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ఇక ఈ ప్రోమోలో త‌మ‌న్‌ను బాల‌య్య ఆట‌ప‌ట్టించ‌డం హైలైట్‌గా నిలిచింది. "నీ గురించి చాలా విన్నాను. ఎన్నో ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నాను. నీకు అనుష్క అంటే చాలా ఇష్టం కదా?" అంటూ కాసేపు తమన్‌ను ఆటపట్టించారు బాలయ్య. ముందుగా ప్రోమోలో తమన్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వ‌డం చూపించారు.

"ఫస్ట్ టైమ్ థియేటర్లలో స్పీకర్లు తగలబడిపోయింది మీ సినిమాకే" అంటూ బాలకృష్ణ‌తో తమన్ చెప్పగా... దానికి బాలయ్య "మీ స్పీకర్ల కెపాసిటీని పెంచుకో! 'డాకు మహారాజ్' వస్తోంది" అంటూ సూపర్ రిప్లై ఇవ్వ‌డం ఈ ప్రోమోలో ఉంది. ఈ ఎపిసోడ్ జ‌న‌వ‌రి 3న రాత్రి 7 గంట‌ల‌కు ఆహాలో ప్ర‌సారం కానుంది. 

కాగా, 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చాందినీ చౌదరి, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. సితారా ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్‌ తమన్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. 


More Telugu News