పెన్షన్ల పంపిణీలో వసూళ్లకు పాల్పడిన మహిళా పోలీసుపై వేటు
- ఏపీలో నేడు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
- వైఎస్సార్ జిల్లాలో ఓ మహిళా పోలీసు వసూళ్ల దందా
- కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్
ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతస్థాయిలో జరుగుతోంది. కాగా, వైఎస్సార్ జిల్లాలో పెన్షన్ల పంపిణీలో వసూళ్లకు పాల్పడిన ఓ మహిళా పోలీసుపై సస్పెన్షన్ వేటు పడింది.
జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ సందర్భంగా మహిళా పోలీసు భారతి వసూళ్లకు పాల్పడినట్టు వెల్లడైంది. భారతి జమ్మలమడుగులో వార్డు సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఈ ఉదయం పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆమె పలువురి నుంచి డబ్బులు తీసుకోవడం అధికారుల దృష్టికి వెళ్లింది. వసూళ్ల నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఆమెను సస్పెండ్ చేశారు.