లైఫ్‌లో బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్‌!: ప్రభాస్ వీడియో సందేశం

  • మన కోసం బ్రతికేవాళ్లు... మనల్ని ప్రేమించేవాళ్లు ఉన్నారంటూ ప్రభాస్ వీడియో
  • డ్రగ్స్‌కు నో చెప్పాలని పిలుపు
  • డ్రగ్స్‌కు ఎవరైనా బానిసలైతే అధికారులకు సమాచారమివ్వాలని సూచన
సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. "మన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు... ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్" అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. రేపు జనవరి 1 కాబట్టి ఈరోజు రాత్రి ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఓ సందేశంతో ప్రభాస్ వీడియో వచ్చింది.

"లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి... కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఉంది... అలాగే మనల్ని ప్రేమించే మనుషులు... మన కోసం బ్రతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?" అంటూ వీడియోను విడుదల చేశారు. 

డ్రగ్స్‌కు నో చెప్పండి... అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ (87126 71111)కు ఫోన్ చేయాలని ఆ వీడియోలో సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.


More Telugu News