అభిషేక్ శ‌ర్మ పెను విధ్వంసం... 96 బంతుల్లోనే 170 ర‌న్స్‌!

  • విజ‌య్ హ‌జారే ట్రోఫీలో సౌరాష్ట్ర‌పై చెల‌రేగిన అభిషేక్ శ‌ర్మ‌
  • 60 బంతుల్లోనే సెంచ‌రీ... మొత్తంగా 96 బాల్స్‌లో 170 ప‌రుగులు
  • ఈ మెరుపు ఇన్నింగ్స్ లో ఏకంగా 8 సిక్స‌ర్లు, 22 ఫోర్లు
  • ఐపీఎల్‌ లో ఎస్ఆర్‌హెచ్‌ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న యంగ్‌ ప్లేయ‌ర్‌  
విజ‌య్ హ‌జారే ట్రోఫీలో టీమిండియా యువ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ పెను విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న అత‌ను సౌరాష్ట్ర‌తో మ్యాచ్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. కేవ‌లం 60 బంతుల్లోనే శ‌తకం బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో అభిషేక్ 96 బంతులు ఎదుర్కొని 170 ప‌రుగులు చేశాడు. 

ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 8 సిక్స‌ర్లు, 22 ఫోర్లు ఉన్నాయి. అలాగే పంజాబ్ జ‌ట్టులో మ‌రో ఆట‌గాడు ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ కూడా 95 బంతుల్లోనే 125 ర‌న్స్ చేశాడు. ఇలా ఈ ఇద్ద‌రూ సౌరాష్ట్ర బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ‌డంతో పంజాబ్ టీమ్ 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 424 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. 

కాగా, అభిషేక్ శ‌ర్మ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గత సీజ‌న్‌లో ఓపెన‌ర్‌గా ప‌లు భారీ ఇన్నింగ్స్‌ల‌తో అభిమానుల‌ను అల‌రించాడు. ఆ త‌ర్వాత టీమిండియా టీ20 జ‌ట్టులో కూడా చోటు ద‌క్కించుకున్నాడు. 

ఇక ఈ యంగ్ టాలెంట్‌కు భార‌త మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ మెంటార్ గా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలోనే అభిషేక్ గ‌త‌ కొంత‌కాలంగా బాగా రాణిస్తున్నాడు. 


More Telugu News