పేరు మార్చుకున్న ఎలాన్ మస్క్.. ఆ పేరుకు అర్థమేంటని వెతికే పనిలో నెటిజన్లు!
- 'ఎక్స్'లో తన పేరును మస్క్‌కు బదులుగా ‘కేకియస్ మాక్సిమస్’గా మార్పు
- ‘కేకియస్ మాక్సిమస్’ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్
- తన ప్రొఫైల్ పిక్‌ను కూడా మార్చేసిన ఎలాన్ మస్క్
- 'పెపే ది ఫ్రాగ్' మీమ్‌ను తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్న వైనం
స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకున్నారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో తన పేరును మస్క్‌కు బదులుగా ‘కేకియస్ మాక్సిమస్’గా మార్చుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఆ పేరుకు అర్థం ఏంటా...? అని వెతికే పనిలో పడ్డారు.
అలాగే తన ప్రొఫైల్ పిక్‌ను కూడా మార్చేశారాయన. 'పెపే ది ఫ్రాగ్' మీమ్‌ను తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. అయితే, కేకియస్ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్. పలు బ్లాక్ చెయిన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ఇది ఇటీవల క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో పెట్టుబడిదారులు, ఔత్సాహికుల దృష్టిని బాగా ఆకర్షించింది. డిసెంబర్ 27 నాటికి కేకియస్ దాదాపు 0.005667 డాలర్ల వద్ద అమ్ముడవుతుండగా.. 24 గంటల్లోనే ఏకంగా 497.56 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
ఇదిలాఉంటే.. ఎలాన్ మస్క్ ఇటీవలే ఓ అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత సంపద ఏకంగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఈ మైలురాయిని ఎవరూ అధిగమించలేదు. దీంతో ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా వివరాల ప్రకారం మస్క్ సంపద విలువ 447 బిలియన్ డాలర్లకు చేరింది.