చివరి టెస్టు కోసం సిడ్నీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు

  • టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు
  • ఇప్పటికే సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్
  • చివరి టెస్టు నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తున్న టీమిండియా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే, జట్టు వెంట కోహ్లీ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. 

సిరీస్ లో చివరిదైన ఈ టెస్టు సిడ్నీలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనుంది. మెల్బోర్న్ టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా... చివరి టెస్టులో నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 

ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా తొలి టెస్టు నెగ్గగా, రెండో టెస్టులో ఆసీస్ నెగ్గింది. మూడో టెస్టు డ్రాగా ముగియగా... నాలుగో టెస్టును ఆసీస్ కైవసం చేసుకుని సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 

చివరి టెస్టులో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఆసీస్ గెలిస్తే సిరీస్ వారి వశం అవుతుంది. కనీసం డ్రా చేసుకున్నా ఆసీస్ సిరీస్ విజేతగా నిలుస్తుంది.


More Telugu News