మరో వివాదం.. అడవి పందిని వేటాడిన మోహన్ బాబు సిబ్బంది

  • జల్ పల్లి నివాసం వెనకున్న అటవీ ప్రాంతంలో అడవి పంది వేట
  • వైరల్ అవుతున్న వీడియోలు
  • మంచు మనోజ్ హెచ్చరికలను సైతం పట్టించుకోని వైనం
గత కొంత కాలంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పేరు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. ఆయన ఫ్యామిలీ విభేదాలు రచ్చకెక్కడం సంచలనం రేపాయి. తాజాగా మోహన్ బాబు సిబ్బంది చేసిన నిర్వాకం కారణంగా ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. 

జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వెనుక ఉన్న అటవీప్రాంతంలో మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడారు. వేటాడిన అడవి పందిని వారు మోసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు, అడవి పందులను వేటాడొద్దని వీరిద్దరికీ మంచు మనోజ్ పలుమార్లు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన మాటను పట్టించుకోకుండా అడవి పందిని వారు వేటాడారు. అయితే అడవి పందిని వీరు ఎప్పుడు వేటాడారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. వీరు అడవి పందిని వేటాడిన సమయంలో మోహన్ బాబు ఇంట్లో లేరని తెలుస్తోంది.


More Telugu News