అప్పట్లో చిరంజీవి ఎలా ఉండేవాడంటే .. కమెడియన్ సుధాకర్!

  • తమిళంలో హీరోగా 30 సినిమాలు చేశానన్న సుధాకర్ 
  • తాను .. రాధిక హిట్ పెయిర్ గా రాణించామని వెల్లడి
  • చిరంజీవి సహృదయుడు అంటూ కితాబు

సుధాకర్ .. ఒకప్పటి స్టార్ కమెడియన్. ఆనాటి స్టార్ హీరోలందరితో అనేక సినిమాలు చేశారాయన. అనారోగ్య కారణాల వలన కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నటనలో నేను శిక్షణ తీసుకున్నాను .. ముందుగా నాకు భారతీరాజా గారు హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అక్కడ ఏడాది పాటు ఆడింది" అని అన్నారు. 

తమిళంలో హీరోగా ఒక 30 సినిమాల వరకూ చేశాను. వాటిలో 20 సినిమాల వరకూ రాధికనే హీరోయిన్. అప్పట్లో మాది హిట్ పెయిర్. ఆ సమయంలో అక్కడి రాజకీయాల్లోకి నన్ను రమ్మని అడిగారు కూడా. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను.  తమిళంలో మంచి క్రేజ్ వచ్చిన తరువాతనే తెలుగు వైపుకు వచ్చాను. తెలుగులో కమెడియన్ గా స్థిరపడ్డాను. కామెడీ విలన్ రోల్స్ కూడా చేశాను" అని చెప్పారు. 

చెన్నైలో సినిమాలలో అవకాశాల కోసం తిరిగేటప్పుడు నేను .. చిరంజీవి .. హరిప్రసాద్ ఒకే రూమ్ లో ఉండేవాళ్లం. మా ముగ్గురిలో ఫస్టు ఛాన్స్ నాకే వచ్చింది. చిరంజీవి సహృదయుడు .. మాతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. పైకి రావాలనే తపన ఎక్కువగా ఉండేది .. అందుకు తగినట్టుగా కష్టపడేవాడు కూడా. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సరదాగా తిరుగుతూనే అవకాశాలు సంపాదించుకునే వాళ్లం. మమ్మల్ని నిర్మాతలుగా చేసి 'యముడికి మొగుడు' వంటి హిట్ ఇచ్చింది కూడా చిరంజీవినే" అని అన్నారు. 



More Telugu News