2024 చివ‌రికి ప్ర‌పంచ జ‌నాభా ఎంతంటే..!

  • ప్ర‌పంచ జ‌నాభా 2024 చివ‌రికి 800.09 కోట్ల‌కు చేరుకున్న‌ట్లు యూఎస్ సెన్స‌స్ బ్యూరో వెల్ల‌డి
  • జ‌నాభాలో 0.9 శాతం (7.1 కోట్లు) పెరుగుద‌ల న‌మోదైంద‌న్న‌ బ్యూరో
  • గ‌తేడాది (7.5 కోట్లు)తో పోలిస్తే స్వ‌ల్ప త‌గ్గుద‌ల
  • 2025లో ప్ర‌తి సెక‌నుకు 4.2 జ‌న‌నాలు, 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యే అవ‌కాశం 
  • ఈ ఏడాది 26 ల‌క్ష‌లు పెరిగి 34.1కోట్ల‌కు చేరిన అమెరికా జ‌నాభా
ప్ర‌పంచ జ‌నాభా 2024 చివ‌రి నాటికి 7.1 కోట్లు పెరిగి 800.09 కోట్ల‌కు (8,092,034,511) చేరుకున్న‌ట్లు యూఎస్ సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. మొత్తానికి 0.9 శాతం పెరుగుద‌ల న‌మోదైంద‌ని బ్యూరో తెలిపింది. అయితే, గ‌తేడాది (7.5కోట్లు)తో పోలిస్తే స్వ‌ల్ప త‌గ్గుద‌ల ఉంద‌ని పేర్కొంది. కాగా, 2025లో ప్ర‌తి సెక‌నుకు 4.2 జ‌న‌నాలు, 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.  

ఇక అమెరికా జ‌నాభా 26 ల‌క్ష‌లు పెరిగి 34.1కోట్ల‌కు (341,145,670) చేరుకుంటుందని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్ల‌డించింది. జనవరి నుంచి ఈ ఏడాది చివ‌రికి 0.78 శాతం (26,40,171) పెరుగుదల న‌మోదైంద‌ని పేర్కొంది. అలాగే 2025లో దేశంలో 9 సెక‌న్ల‌కు ఒక జ‌న‌నం, 9.4 సెక‌న్ల‌కో మ‌ర‌ణం న‌మోద‌వ్వ‌చ్చ‌ని సెన్స‌స్ బ్యూరో అంచ‌నా వేసింది. కాగా, అంతర్జాతీయ వలసలు ప్రతి 23.2 సెకన్లకు యూఎస్‌ జనాభాకు ఒక వ్యక్తిని జోడించగలద‌ని తెలిపింది.


More Telugu News