రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ

  • శ్రీవారి దర్శనంకు సంబంధించి లేఖ రాసిన ఏపీ సీఎం
  • తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతిస్తున్నట్లు వెల్లడి
  • చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ థ్యాంక్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.

ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం 2 లేఖలను స్వీకరించనున్నట్లు అందులో తెలిపారు. సోమవారం నుంచి గురువారం వరకు ఏవైనా రెండు రోజులు అనుమతిస్తామన్నారు.

చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్‌కు తెలంగాణ స్పీకర్ థ్యాంక్స్

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు స్పీకర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని తాను కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వినతిపత్రాలు అందించానని ఆ ప్రకటనలో తెలిపారు. సిఫార్సు లేఖలకు అంగీకరించినందుకు తెలంగాణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వరస్వామి దర్శనం, వసతి మరింత సులభమవుతుందన్నారు.


More Telugu News