2025లో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం... హరీశ్ రావు కొత్త దారి వెతుక్కుంటారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • కేటీఆర్, హరీశ్ రావులకు సినిమా చూపిస్తామన్న బీర్ల ఐలయ్య
  • కవితకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్న ఐలయ్య
  • బీఆర్ఎస్ కథ క్లైమాక్స్‌కు చేరుకుందని వ్యాఖ్య
కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావుకు సినిమా చూపిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2025లో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అదే సమయంలో హరీశ్ రావు కొత్త దారి చూసుకుంటారన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ మీద బయట ఉన్న కవితకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కథ క్లైమాక్స్‌కు వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఆయన, ఐఎన్‌టీయూసీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న ఐఎన్‌టీయూసీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిందన్నారు.


More Telugu News