అల్లు అర్జున్ గురించి పవన్ కల్యాణ్ చెప్పింది ఇదే: ఎస్కేఎన్

  • సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్
  • అల్లు అర్జున్ ప్రస్తావన తెచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం
  • అయితే మీడియాలో కొన్ని కథనాలపై నిర్మాత ఎస్కేఎన్ అభ్యంతరం
  • పవన్ వ్యాఖ్యల ఫుల్ వీడియో పంచుకున్న వైనం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ అల్లు అర్జున్ అంశంపై స్పందించి, కొన్ని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మీడియాలో ఎక్కడ చూసినా పవన్ వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. 

అయితే, ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదం ఉందని పవన్ అన్నట్టుగా కొన్ని కథనాలు రాగా, వాటిని టాలీవుడ్ నిర్మాత, అల్లు కుటుంబ సన్నిహితుడు ఎస్కేఎన్ ఖండించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ను ఒంటరివాడ్ని చేశారు... ఈ ఘటనలకు అల్లు అర్జున్ ఒక్కడ్నే ఎలా నిందిస్తారు?... ఇదీ అల్లు అర్జున్ గురించి, సంధ్య థియేటర్ ఘటన గురించి పవన్ కల్యాణ్ చెప్పింది అంటూ ఎస్కేఎన్ వివరణ ఇచ్చారు. 

తప్పుడు సమాచారానికి, పుకార్లకు స్వస్తి పలకడానికి ఇదే సమయం అంటూ, ఇవాళ పవన్ మీడియాతో మాట్లాడిన వీడియోను కూడా ఎస్కేఎన్ పంచుకున్నారు.


More Telugu News