రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడినట్లుగా ఉంది... ఎవరూ చెప్పడం లేదు: బండి సంజయ్
- చట్టం తన పని తాను చేసుకుపోతే అసెంబ్లీలో చర్చ ఎందుకని ప్రశ్న
- ఆరు గ్యారెంటీల అమలును పక్కదారి పట్టించేందుకే అరెస్ట్ చేశారని విమర్శ
- పుష్ప-3 రాకముందే ఆ సినిమాను చూపించారన్న బండి సంజయ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడినట్లుగా తనకు అనుమానం కలుగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ ఎక్కడ చెడిందో ఇద్దరిలో ఎవరూ చెప్పడం లేదన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సంధ్య థియేటర్ ఘటన, నటుడు అల్లు అర్జున్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అలాంటప్పుడు అసెంబ్లీలో చర్చ ఎందుకని ప్రశ్నించారు.
పుష్ప-3 సినిమా రాకముందే సీఎం రేవంత్ రెడ్డి పుష్ప-3ని చూపించారని చురక అంటించారు. ఈ సినిమాకు 1,700 కోట్ల కలెక్షన్లు వచ్చాయని, జాతీయస్థాయిలోనూ ఈ సినిమాకు పేరు వచ్చిందన్నారు. తెలంగాణలో చాలామంది హీరోలు ఉన్నారని... కానీ అల్లు అర్జున్ పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి మధ్య ఎక్కడో చెడిందన్నారు. ఆరు గ్యారెంటీల అమలును పక్కదారి పట్టించేందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని విమర్శించారు.